How to earn money from YouTube in Telugu:-
YouTube ద్వారా డబ్బు సంపాదించడం ఎలా ...?
మీరు యూట్యూబ్లో పాటలు, సినిమాలు, కామెడీ వీడియోలు చూస్తూ ఉంటా రా..?అయితే మీరు తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి.
మీకు ఎవరైనా ఎప్పుడైనా చెప్పారా,.... యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించుకోవచ్చని...?
అవునండి బాబు, ఇప్పుడు మీరు కూడా యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు.
చాలా మంది ప్రజలు వాళ్ళ హాబీస్ ని, వాళ్లు చేసే పనులను చిత్రీకరించి వీడియో రూపంలో తయారు చేసి యూట్యూబ్లో పెడతారు.
మీరు యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలంటే మీరు ఎందులో ప్రావీణ్యం కలిగి ఉన్నారో ఫస్ట్ అది తెలుసుకోండి
- పాటలు పాడడం లోన
- వంటకాల్లో నా టీచింగ్ లోన
- ఫ్యాషన్ advice లోన
- కామెడీ చేయడంలోన
- గేమ్స్ ఆడడం లోనా
- ఇంకా ఏవైనా వాటిలో మీరు ప్రావీణ్యం కలిగి ఉంటే
ఉదాహరణకి:
- నాకు వంటకాలు బాగా వచ్చు అనుకోండి నేను ఆ వంటకాలను తయారు చేసేటప్పుడు ఆ వంటకాలను వీడియో రూపంలో చిత్రీకరించవచ్చు. లేదా నాకు పాటలు బాగా పాడటం వచ్చు అనుకోండి నేను పాడే ప్రతి పాట ను చిత్రీకరించి వీడియో రూపంలో నేను యూట్యూబ్ లో పెట్టుకోవచ్చు.
- ఇంకా చెప్పాలంటే మన "వివా హర్ష, మహాతల్లి, వాళ్లే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్". వాళ్లు,వాళ్ల హాబీస్ ని వీడియో రూపంలో చిత్రీకరించి యూట్యూబ్ లో ప్రవేశపెడుతున్నారు. ఇంకా చెప్పాలంటే మీకు గేమ్స్ బాగా ఆడటం ఇష్టం అనుకోండి మీరు గేమ్స్ ని రికార్డ్ చేసి కూడా యూట్యూబ్ లో పెట్టవచ్చు దాని నుంచి డబ్బు సంపాదించవచ్చు.
- ఇంకా కొంతమంది వాళ్లు దర్శించిన అందమైన ప్రదేశాలను చిత్రీకరించి వాటిని వీడియో రూపంలో తయారుచేసి యూట్యూబ్ అప్లోడ్ చేస్తారు.
- ఇంకా చాలా ఉన్నాయి అండి చెప్పాలంటే సినీ నటుల గురించి, పెయింటింగ్, ఫోటోగ్రఫీ ట్రావెలింగ్, కామెడీ, మొబైల్ గురించి కొత్త న్యూస్, ఇంకా ఏదైనా సర్వీసులు ఇలాంటివి ఎన్నో గురించి మీరు కూడా వీడియో తయారు చేసి You Tube ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.
మీరు చేసిన వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే వాళ్ళు తప్పకుండా ఏదైనా సోషల్ మీడియా లో ఫేస్బుక్ గాని వాట్సప్ కానీ వాటిలో షేర్ చేస్తారు అప్పుడు మీ ఛానల్ ప్రసిద్ధి అవుతుంది.
యూట్యూబ్ లో యాడ్ డిస్ప్లే చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు. అయితే యూట్యూబ్ మీకు $1 నుంచి $6, 1000 విస్కీ ఇస్తుంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం $1= 69 Rs నుంచి 70 Rs మధ్యలో ఉంటుంది.
మీ స్క్రీన్ మీద ఉన్న యాడ్ ని ఆడియన్స్ క్లిక్ చేసినప్పుడు, యాడ్స్ skip చేయకుండా చూసినప్పుడు మాత్రమే యూట్యూబ్ మనీ జనరేట్ అవుతుంది. ఒకవేళ మీకు 1000 కంటే ఎక్కువ views వచ్చి మీ ఆడియన్స్ ఎవరు యాడ్ ని క్లిక్ చేయకపోతే, యాడ్స్ ని పూర్తిగా చూడకపోతే, మనీ జనరేట అవ్వవు.
కాబట్టి ఇప్పుడు మీరు కూడా మీ సొంత వీడియోని అప్లోడ్ చేసి వాటి ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు.
కానీ మీరు తెలుసుకోవాల్సింది ఇంకా ఉందండి,"You Tube నిబంధనలు మరియు షరతులు", యూట్యూబ్ ఛానల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసి డబ్బులు సంపాదించాలో నెక్స్ట్ ఆర్టికల్లో నేను మీకు కంప్లీట్గా చెప్తాను.
నీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, మరియు ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.


Comments
Post a Comment