HOW TO RECORD YOUR COMPUTER SCREEN FREE IN TELUGU:
చాలామంది, వాళ్ల కంప్యూటర్ స్క్రీన్ ని రికార్డ్ చేయాలి అంటే ఏదైనా సెల్ ఫోన్ ద్వారా లేదా డిజిటల్ కెమెరా ని స్క్రీన్ ముందల పెట్టి రికార్డ్ చేస్తారు. కానీ రికార్డ్ చేసేది కొన్నిసార్లు క్లారిటీ ఉండవచ్చు లేదా కొన్నిసార్లు క్లారిటీ ఉండకపోవచ్చు ఇప్పుడు ఈ సమస్యను మనం స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి సింపుల్ గా స్క్రీన్ ని రికార్డ్ చేసుకోవచ్చు.
అవునండి ఇప్పుడు మీరు మీ కంప్యూటర్ స్క్రీన్ ని రికార్డ్ చేయవచ్చు మీ కంప్యూటర్ లో జరిగే ప్రక్రియను రికార్డ్ చేసి మీకు కావాల్సిన విధంగా వీడియో రూపంలో తయారు చేయవచ్చు.
మీ కంప్యూటర్ స్క్రీన్ ని కూడా మీరు ఫోటో తీయవచ్చు.
మొదటిగా మీ కంప్యూటర్లో మీరు స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి రికార్డింగ్ సాఫ్ట్వేర్ని , ఇన్స్టాల్ చేసి ఉంచాలి.
ఇప్పుడు నేను మీకు బందీ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను.
"BANDI CAM" రికార్డర్ అనేది చాలా మంచి రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఇది ఫ్రీ వెర్షన్లో అందుబాటులో ఉంది కానీ లిమిటెడ్ గా రికార్డింగ్ అవుతుంది.
సింపుల్ గా చెప్పాలంటే ఉచిత ప్లాన్ లో 1- GB వీడియో మాత్రమే రికార్డవుతుంది ఆపై రికార్డింగ్ అవ్వదు. 1-GB కి పైగా రికార్డింగ్ చేయాలంటే మీరు మనీ పే చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
మీరు ఫ్రీ ప్లాన్ ని ఉపయోగించిన యెడల మీ రికార్డయిన వీడియోలో BANDI CAM యొక్క లోగో మరియు పేరు ఉంటుంది. అదే మీరు ప్రీమియం ప్లాన్ లో రికార్డ్ చేస్తే BANDI CAM యొక్క లోగో మరియు పేరు ఉండదు.
మీకు నెక్స్ట్ ఆర్టికల్లో కేవలం స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను. అందులో ఏవి ఉచితమైన రికార్డింగ్ సాఫ్ట్వేర్...? ఏవి ప్రీమియం రికార్డింగ్ సాఫ్ట్వేర్.......? మీకు తెలియజేస్తాను.
ఇప్పుడు కంప్యూటర్ లో మీరు జరిపే ప్రక్రియను, చేసే పనులను ఎలా రికార్డ్ చేయాలో మీకు తెలియజేస్తాను.
మీకు కంప్యూటర్ స్క్రీన్ ని ఎలా రికార్డ్ చేయాలో తెలియకపోతే క్రింద ఉన్న ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
చూశారు కదా అండి, చాలా సింపుల్ మీకు ఇందులో ఇంకా డౌట్స్ ఉంటే మీకు ఈ ఆర్టికల్ లో ఏదైనా అర్థం కాకపోయినా యెడల మీరు మీ సందేశాన్ని మాకు తెలియ చేయ వలెను ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ ప్రశ్నలు పంపవలెను. ఇక్కడ క్లిక్ చేసి మీ ప్రశ్నను టైప్ చేయండి.
నెక్స్ట్ ఆర్టికల్లో ఉచిత రికార్డింగ్ స్క్రీన్ సాఫ్ట్ వేర్ గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను.
ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.
Comments
Post a Comment