Skip to main content

Posts

ఫొటోస్ ని పిడిఎఫ్ లోకి మార్చడం మీకు తెలుసా .... ?

JPG to PDF converter free new in Telugu: ఫ్రెండ్స్ మరి చాలాసార్లు మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ కానీ లేకపోతే మీ సర్టిఫికెట్స్ ని పిడిఎఫ్ రూపంలో అడుగుతూ ఉంటారు. ఈరోజు పిడిఎఫ్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలో మీకు చూపిస్తాను.  కొన్ని సాఫ్ట్వేర్ ద్వారా పిడిఎఫ్ లోకి  మనం మార్చవచ్చు లేదా ఆన్లైన్లో డైరెక్ట్ గా పిడిఎఫ్ కన్వర్టర్ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి పిడిఎఫ్ గా ఫోటోస్ ని  మార్చ వచ్చు.  మీ జేపీజీ ఫోటో ని పిడిఎఫ్ లో కి ఎలా మార్చాలో ఈ క్రింద ఉన్న ప్రాసెస్ ని ఫాలో అవండి: లింక్ పై క్లిక్ చేయండి   https://jpg2pdf.com/
Recent posts

మీ కంప్యూటర్ స్క్రీన్ ని రికార్డ్ చేయడం ఎలా..?

HOW TO RECORD YOUR COMPUTER SCREEN FREE IN TELUGU: చాలామంది, వాళ్ల కంప్యూటర్ స్క్రీన్ ని రికార్డ్ చేయాలి అంటే ఏదైనా సెల్ ఫోన్ ద్వారా లేదా డిజిటల్ కెమెరా ని స్క్రీన్ ముందల పెట్టి రికార్డ్ చేస్తారు. కానీ రికార్డ్ చేసేది కొన్నిసార్లు క్లారిటీ ఉండవచ్చు లేదా కొన్నిసార్లు క్లారిటీ ఉండకపోవచ్చు ఇప్పుడు ఈ సమస్యను మనం స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్ యూస్ చేసి సింపుల్ గా స్క్రీన్ ని రికార్డ్ చేసుకోవచ్చు.   అవునండి ఇప్పుడు మీరు మీ కంప్యూటర్ స్క్రీన్ ని రికార్డ్ చేయవచ్చు మీ కంప్యూటర్ లో జరిగే ప్రక్రియను రికార్డ్ చేసి మీకు కావాల్సిన విధంగా వీడియో రూపంలో తయారు చేయవచ్చు.   మీ కంప్యూటర్ స్క్రీన్ ని కూడా మీరు ఫోటో తీయవచ్చు.  మొదటిగా మీ కంప్యూటర్లో మీరు  స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి  రికార్డింగ్ సాఫ్ట్వేర్ని , ఇన్స్టాల్ చేసి ఉంచాలి.   ఇప్పుడు నేను మీకు బందీ రికార్డింగ్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి   స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను.  " BANDI CAM " రికార్డర్ అనేది చాలా మంచి రికార్డింగ్ సాఫ్ట్వేర్ ఇది ఫ్రీ వెర్షన్లో అందుబాటులో ఉంది కానీ లిమిటెడ్ గా రికార్డిం

మీ కంప్యూటర్లో అద్భుతమైన డెస్క్టాప్ వాల్పేపర్ మార్చడం ఎలా...?

How to download and install new desktop wallpaper themes windows 7, 8.1, 10 in Telugu: మీ కంప్యూటర్లో అద్భుతమైన డెస్క్టాప్ వాల్పేపర్  మార్చడం ఎలా...? ఇప్పుడు మీరు మీ డెస్క్టాప్ స్క్రీన్ ని అద్భుతమైన విధంగా అలంకరించవచ్చు మీకు కనువిందు చేసే డెస్క్టాప్ వాల్ పేపర్స్ మీరు డౌన్లోడ్ చేసి స్క్రీన్ మీద పెట్టవచ్చు. మీకు మైక్రోసాఫ్ట్ website, ఇంకా వేరే వెబ్సైట్లు కూడా డెస్క్టాప్ వాల్పేపర్  ని అందచేస్తాయి దీంట్లో ఉన్న మరో మంచి ఆప్షన్ ఏమిటంటే వాల్ పేపర్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్ కూడా చేంజ్ అవుతాయి. నేను నా కంప్యూటర్ లో మౌస్ క్లిక్ చేసనుక్కోండి అప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో సౌండ్ కూడా వస్తుంది డెస్క్టాప్ వాల్పేపర్ సంబంధించిన సౌండ్ . మీ కంప్యూటర్లో మీరు కూడా ఇప్పుడు లేటెస్ట్ డెస్క్టాప్ వాల్ పేపర్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే క్రింద ఉన్న ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.  లేదా ఈ లింక్ పై క్లిక్ చేయండి-    NEW DESKTOP THEMES   ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి . సబ్స్క్రయిబ్ బటన్ ని క్లిక్ చేసి లేటెస్ట్ అప్డేట్

వాట్సాప్ ని కంప్యూటర్ లో ఓపెన్ చేయడం ఎలా

How to open Watsapp ascount in a computer in Telugu:- మీరు  విన్నది కరెక్టే నండి ఇప్పుడు మీ కంప్యూటర్లో మీ   మొబైల్  వాట్సాప్  అకౌంట్ ని ఓపెన్ చేసి మెసేజీలు పంపించవచ్చు.  మనం రోజు మన ఫ్రెండ్స్ కి మెసేజ్ పంపించాలంటే వాట్సప్ లేదా ఫేస్ బుక్ యూస్ చేస్తాం.  మనం ఫేస్ బుక్ ని కంప్యూటర్ లో డైరెక్ట్ గా ఓపెన్ చేయడం సాధ్యమే. కానీ వాట్స్అప్ మాత్రం కంప్యూటర్ లో ఓపెన్ చేయడానికి ఉండదు.  కానీ ఇప్పుడు వాట్సాప్ ని కూడా మనం కంప్యూటర్ లో సులభంగా ఓపెన్ చేసి చూడొచ్చు వాట్సాప్ ని ఈ వెబ్సైట్ ద్వారా మనం ఓపెన్ చేసి చూడవచ్చు.  ఈ లింక్ ని ప్రెస్ చేయండి-  Watsapp for computer .  మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది- ఇప్పుడు క్రింది చూపిస్తున్న ప్రాసెస్ ని జాగ్రత్తగా గమనించండి: మీ మొబైల్ ఫోన్ లో వాట్సాప్ ని ఓపెన్ చేయండి.  ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఫొటోలో చూపిన విధంగా.   ఇప్పుడు వాట్సప్ వెబ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి.  ఇప్పుడు మీ ఫోన్ లో ఉన్న కోడ్ ని కంప్యూటర్ కోడ్ కి  స్కాన్  చేయండి .  మీరు మీ కంప్యూటర్ లో వాట్సాప్ ని ఓపెన్ చేసేసారు.   మీ వాట్సాప్ ని  Logout  చేయాల

మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం ఎలా ...?

How to create a Word Document in Telugu మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అనేది మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ కంపెనీ ద్వారా ఆవిష్కరించబడింది.   దీని ద్వారా మనం టెక్స్ట్ (message)  డాక్యుమెంట్స్ ని తయారు చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు ఇతరులకు ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు. మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్  సాఫ్ట్వేర్  ఫైల్స్ ని మీరు మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీ కంప్యూటర్ ఆపరేటర్ కి చెప్పి ఇన్స్టాల్  చేయించుకోవచ్చు. సాధారణంగా టైప్ రైటర్ లో స్పెల్లింగ్ కరెక్షన్ చేయలేము, కానీ MS WORD వాడడం ద్వారా స్పెల్లింగ్ మిస్టేక్స్ ని కూడా మనం సరి చేసుకోవచ్చు. మనం టైప్ రైటర్ లో చేయలేని పనులన్నీ ఎమ్మెస్ వర్డ్లో చేయవచ్చు.  ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోస్ ని కూడా ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ లో పెట్టవచ్చు, బిజినెస్ చాట్,  వీడియోస్, ఆడియో ఫైల్స్, ని కూడా ఎంఎస్ వర్డ్ లో పెట్టి షేర్ చేయవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలో క్రింది ఉన్న ఫొటోస్ ని చూసి నేర్చుకోండి:- సింపుల్...! ఇలా మీరు వర్డ్ డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఆర్ట

ఇంటర్నెట్ లో ఒక ఆర్టికల్ ని పిడిఎఫ్ రూపంలో సేవ్ చేయడం ఎలా:....?

How to download any article of a page into a Pdf file in Telugu మీరు ఇంటర్నెట్ లో ఏదైనా ఆర్టికల్ ని pdf  లో కి మార్చాలని అనుకుంటే ఇప్పుడు మీరు సులభంగా పిడిఎఫ్ లోకి  మార్చుకొని   మీ కంప్యూటర్లో సేవ్ చేసుకోవచ్చు.    ఇంటర్నెట్ లో ఒక ఆర్టికల్ ని పిడిఎఫ్ రూపంలో సేవ్ చేయడం  ఎలాగో కింది చిత్రాలను చూసి నేర్చుకోండి.  గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయండి.  మీకు కావాల్సిన వెబ్సైట్లోకి వెళ్లి ఆర్టికల్ ని ఓకే చేయండి. (example :  YouTube ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చా ...?    ఈ లింక్ పై క్లిక్ చేయండి)  Ctrl + P బటన్స్ ని క్లిక్ చేయండి. చేంజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసి అందులో పిడిఎఫ్ మీద క్లిక్ చేయండి. షేర్   మీద క్లిక్ చేయండి. ఎక్కడ సేవ్ చేయాలో నిర్ణయించుకోండి.  సింపుల్ ఈ ఆర్టికల్ ని ఫాలో అయితే మీరు ఇంటర్నెట్ లో ఏ ఆర్టికల్ నైనా పిడిఎఫ్ రూపంలో పొందవచ్చు.      

కంప్యూటర్ లో ఫోల్డర్ ని క్రియేట్ చేయడం ఎలా...?

How to create a folder in PC:- మీకు కంప్యూటర్ లో ఫోల్డర్ క్రియేట్ చేయడం తెలియదా..?  ఒక ఫోల్డర్ అనేది విభిన్నమైన ఫైల్స్ని స్టార్ట్ చేసుకోవటానికి ఉపయోగిస్తాం.  ఈ ఫైల్స్ లో మనం ఏవైనా స్టోర్ చేసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే ఒక ఆడియో ని లేదా ఇమేజ్ ని లేదా వీడియోని, గేమ్స్ ని ఇలా ఏవైనా ఫైల్ లో సేవ్ చేసుకోవచ్చు.  ఫోల్డర్ని కంప్యూటర్లో ఎక్కడైనా  స్క్రీన్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. మీరు 4 దశల్లో ఫోల్డర్ను సృష్టించవచ్చు.  సింపుల్ గా కింద ఉన్న ఫోటోస్ ని చూసి నేర్చుకోండి. మీ కంప్యూటర్ స్క్రీన్ పైన లేదా మీ కంప్యూటర్లో ఎక్కడైనా బ్లాంక్ స్పేస్ ( అనగా ఖాళీ ప్రదేశంలో ) పై మౌస్ యొక్క రైట్ క్లిక్ చేయండి  ఇప్పుడు న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి న్యూ లో ఫోల్డర్ ని సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఫోల్డర్ కి పేరు  టైప్ చేయండి.  సింపుల్ మీరు ఫోల్డర్ క్రియేట్ చేసేసారు.  ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి,లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.